ఓ మిత్రమా,
వెళ్ళిపోతున్నావా?
అవును.. వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది కదా..
మిత్రమా,
భూ నిర్వాసితుల ఆక్రోశనల మధ్య,
ప్రేమోన్మాదుల కామోన్మాదుల కబంధ హస్తాలలో నలిగిపోతున్న అబలల ఆర్తనాదాల మధ్య,
ఆర్ధిక మాంద్యపు కోరలలో చిక్కుకొన్న సామాన్య ప్రజల ఆవేదనల మధ్య,
అగ్రరాజ్యాల దురహంకార చేష్టల మధ్య,
మనస్సు లేని ఉగ్రవాదుల విలయ తాండవముల మధ్య,
గడిపావు నీ జీవితమంతా..

అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు,
ఆకలి చావులు,
మునిగిన లేక ఎండిన పంట పొలాలు,
నేలమట్టమైన బడుగుల గుడిసెలు,
బాంబు ప్రేలుళ్ళు,
ఇవేనా?..నీ జ్ఞాపకాలు
మిత్రమా,
కుళ్ళు రాజకీయాల వాసనతో,
యాసిడ్ చేసిన గాయాలతో,
బుల్లెట్లు చేసిన రంధ్రాలతో,
గాజు పెంకులు, ఇనుప ముక్కలతో నెత్తురోడిన శరీరంతో
అంతిమ క్షణాల కోసం ఎదురు చూస్తున్నావా?
సంతోషం కంటే విషాదమే ఎక్కువగా ఉన్న నీ జీవితం లో,

ఈ విషాదాలే నీ జ్ఞాపకాలు అవుతాయని భయపడుతున్న తరుణం లో,
అగ్ర రాజ్యపు అధినేత చెవులను రాసుకుంటూ,
సామ్రాజ్యవాదుల అహంకారాన్ని గేలి చేస్తూ,
ఒక దాని వెంట ఒకటి గా వచ్చిన ఆ ఇరాకీ విలేకరి ఆల్ జైది పాదుకలు,
నీకు మంచి జ్ఞాపకాలు మిగిల్చాయని .. నీకు కాస్త ఊరట నిచ్చాయని ఆశిస్తున్నాను మిత్రమా..
ఉంటాను మరి..